రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నట్టు గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలు నిజమే అన్నట్టు రష్మిక విజయ్ ని డార్లింగ్ అంటూ పిలిచింది. అసలు విషయానికి వస్తే గోవిందం తర్వాత విజయ్ హీరోగా పరుశురాం ఫ్యామిలీ స్టార్ అనే మూవీని తెరకెక్కించాడు. మృణాల్ హీరోయిన్‌గా చేస్తున్న ఈ మూవీకి . గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికే వస్తున్నట్లు ప్రకటించాఋ కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. ఇక అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఫ్యామిలీ స్టార్ ఈ ఏప్రిల్ 5న భారీగా విడుదలవుతోంది. దీంతో తాజాగా ట్రైలర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. అయితే ఈ ట్రైలర్‌పై రష్మిక ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ అదిరిందని.. సినిమా సూపర్ హిట్ అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు.. నా డార్లింగ్స్ పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండలకు ఆల్ దిబెస్ట్ అంటూ ఆ ట్వీట్‌లో తెలిపింది. పార్టీ కావాలని ట్విట్టర్ ద్వారా కోరింది. దీంతో ప్రస్తుతం ఈ ట్వీ్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఈ ట్వీట్‌కు స్పందించిన విజయ్ దేవరకొండ.. క్యూటెస్ట్ అంటూ పోస్ట్ చేశారు. అయితే ఈ ట్వీట్‌లపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ రొమాన్స్ ఏంటీ బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ది ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ మాత్రం మంచి విజువల్స్‌తో వావ్ అనిపిస్తూ ఇప్పటికే టీజర్, పాటలతో మంచి బజ్’ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ అదరిందినే చెప్పాలి. విజయ్ పై కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. ఒక పక్క ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తూపే.. మరో పక్క అమెరికాలో లుంగిలో కనిపిస్తూ అదరగొట్టాడు. ఫ్యామిలీ స్టార్ మూవీ ఏప్రిల్ 5న తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఇక ఈ సినిమాలో రష్మిక మందన క్యామియో అప్పియరెన్స్ ఇవ్వనుందని చిత్ర యూనిట్ తెలిపింది.