పుష్ప తో ఐకాన్ స్టార్ గా ఎదిగిన అల్లు అర్హున్ ఆయన అభిమాను మరింతగా పెంచుకున్నారు. ఆ చిత్రం ఘన విజయంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 చిత్రం రిలీజ్ డేట్ చెప్పేశారు చిత్ర యూనిట్. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం పుష్ప-2 కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం ప్రకటిస్తూ డిసెంబరు 6న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని వెల్లడించింది. ఈ క్రమంలోనే హీరో అల్లు అర్జున్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు . తలకు కట్టు, చేతిలో సమురాయ్ ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ను ఈ పోస్టర్ లో చూడొచ్చు.అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో పుష్ప-2పై భారీ అంచనాలు నెలకొనగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు, టీజర్లకు విశేష స్పందన లభించింది. వాస్తవానికి పుష్ప-2 చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్రబృందం భావించగా అదే రోజున రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్ తో పాటు మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందువల్లే పుష్ప-2 రిలీజ్ డేట్ వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తోంది.