చిరంజీవి కూతురు శ్రీజ మాజీ భర్త శిరీష్ భరద్వాజ్ మృతి చెందారు.. గత కొంతకాలంగా శిరీష్ ఊపిరి తిత్తుల సమస్యతో అనారోగ్యం పాలయ్యారు.. ఈ క్రమంలో ఆయన గత కొద్ది రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.. ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ఐసీయూ లో చికిత్స అందిస్తున్నారు.. అయినా కానీ ఆయనకు పరిస్థితి విషయమించించటంలో బుధవారం కన్నుమూశారు.. ఊపిరి తిత్తుల సమస్యతో పాటు ఆయనకు గుండెపోటు రావటంతో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు.. కాగా చిన్న వయసులో ఆయన మృతి చెందటం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఇక శ్రీజ మాజీ భర్త మృతి పై స్పందిస్తూ నటి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. శిరీష్ ఫ్రెండ్స్ కూడా ఆయన మృతిని కన్ఫర్మ్ చేశారు.. లంగ్స్ సమస్యకు తోడుగా గుండెపోటు రావటంతో శిరీష్ చనిపోయారని వారు తెలిపారు. అయితే అప్పట్లో శ్రీజ, శిరీష్ ప్రేమ వివాహం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.. చిరంజీవికి సినిమాల్లో అత్యంత క్రేజ్ ఉన్న టైంలోనే శ్రీజ ఇంట్లో నుండి వెళ్ళిపోయి ఆర్య సమాజ్ లో శిరీష్ భరద్వాజ్ ను పెళ్లి చేసుకుంది.. దాంతో కొన్ని రోజుల పాటు ఈ జంట వార్తల్లో నిలిచి వైరల్ గా మారింది.. అయితే కొంతకాలం పాటు హ్యాపీ గా ఉన్న ఈ జంటకు ఓ పాప కూడా జన్మించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావటంతో విడిపోయారు.. తనను వేడిస్తున్నాడంటూ 2012 లో శ్రీజ, శిరీష్ పై గృహహింస కేసు పెట్టింది.. కేస్ ఫైల్ అయిన రెండేళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.. అప్పటినుండి పాప శ్రీజ దగ్గరే ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలనికి శిరీష్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోగా శ్రీజ కూడా పెద్దల సమక్షంలో కళ్యాణ్ దేవ్ ని వివాహం చేసుకుంది.. వీరిద్దరికి కూడా మరో పాప పుట్టింది.. చిరంజీవి అల్లుడిగా వెండి తెరకు పరిచయం అయి కళ్యాణ్ దేవ్ కొన్ని చిత్రాల్లో నటించాడు.. ఆ తర్వాత వీరి మధ్య కూడా గొడవలు రావటంతో కొంతకాలంగా శ్రీజ, కళ్యాణ్ కూడా వేరు వేరుగానే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తన కూతురును కూడా శ్రీజ చూడనివ్వట్లేదంటూ ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్న శిరీష్ మృతి పట్ల నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..