RamCharan
RamCharan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన రేపు బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్త ఈరోజు బాగా వైరల్ అయ్యింది. ఉపాసనకు రేపే డాక్టర్లు ప్రసవం చేయబోతున్నారని ఈరోజు ఉదయం నుంచీ ప్రచారం జరుగుతోంది. దీంతో ఉపాసన బుల్లి మెగాస్టార్‌ను తమకు అందించాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రామ్ చరణ్, ఉపాసన చేసిన ట్వీట్లు ఆసక్తి రేపుతున్నాయి. రేపు ఉపాసన ప్రసవం అని జరుగుతోన్న ప్రచారం నిజమే అనిపిస్తోంది.ఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం సంగీత దర్శకుడు, గాయకుడు కాలభైరవ ఒక అందమైన ట్యూన్‌ను క్రియేట్ చేశారు. ఈ ట్యూన్ ఎంతో ఆహ్లాదకరంగా.. చంటిపిల్లలు ఈ ట్యూన్ విని ఆనందంతో చిరునవ్వులు చిందించేలా ఉంది. తమ బిడ్డ కోసం ఇంత మంచి ట్యూన్ అందించినందుకు కాలభైరవకు కృతజ్ఞతలు తెలుపుతూ రామ్ చరణ్, ఉపాసన ట్వీట్ చేశారు. కాలభైరవ అందించిన ట్యూన్‌ను కూడా ఈ ట్వీట్‌లో వీడియో రూపంలో పొందుపరిచారు.

Previous articleపోలీసులను ఆశ్రయించిన ‘ఆదిపురుష్’ డైలాగ్ రైటర్
Next articleకాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనం ఖాయమా..?