మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ ఇద్దరి ఎంగేజ్‌మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో జరగ్గా.. పెళ్లి వేడుకను విదేశాల్లో ఘనంగా నిర్వహించేందుకే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ‘గాండీవధారి అర్జున’ చిత్రంతో వరుణ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శుక్రవారం విడుదలయ్యే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుణ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరోయిన్ సాక్షి వైద్య యాంకర్ సుమ హోస్ట్ గా వస్తున్న ‘సుమ అడ్డా’ అనే షోకి హాజరయ్యారు. ఈ షోలో పలువురు లావణ్య గురించి వరుణ్ ను ఆసక్తికర ప్రశ్నలు అగిగారు. లావణ్య నెంబర్ ను తన మొబైల్ లో ఏమని సేవ్ చేసుకున్నాడు? అని ఒకరు అడిగితే, ‘లవ్’ అని వరుణ్ చెప్పాడు. లావణ్యనే తన సెల్ ఫోన్ తీసుకొని ఆలా నంబర్ ను సేవ్ చేసిందన్నాడు. లావణ్య త్రిపాఠికి ఇచ్చిన మొట్ట మొదటి గిఫ్ట్ ఏంటో గుర్తుందా? అని అడగ్గా.. చాలా సంవత్సరాలు అయింది కదా గుర్తులేదు అని వరుణ్ సమాధానం ఇచ్చాడు.

Previous articleChandrayaan-3 తెలంగాణ విద్యాశాఖ యూటర్న్.. ఆ నిర్ణయం వెనక్కి
Next articleజడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేసిన సుప్రీంకోర్టు