స్టార్ దర్శకుడు అట్లీ అల్లు అర్జున్ తో ఓ మూవీ చేస్తున్నట్టు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే .. అయితే ఏంజరిగిందో ఏమోకానీ ఈ ప్రాజెక్ట్ నుంచి బ‌న్నీ తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి స‌ల్మాన్ ఖాన్ వచ్చారు. కాగా మ‌రి ఇది బ‌న్నీ కోసం రాసుకున్న క‌థ‌నా.. ? సల్మాన్ ఖాన్ కోసం ప్ర‌త్యేకంగా రాసుకున్న స్టోరీనా.. ? అనేది తెలియ‌దు గానీ ఇద్దరి కాంబినేష‌న్ లో మూవీ అనేస‌రికి అంచ‌నాలు మాత్రం పీక్స్ కి చేరాయి. ఇప్పుడా అంచ‌నాలను మరింత పెంచేస్తూ అట్లీ దీన్ని పాన్ ఇండియా మ‌ల్టీస్టార‌ర్ గా మార్చే ప‌నిలో ప‌డ్డాడు. బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ ఖాన్ లాక్ అయిన నేప‌థ్యంలో సౌత్ నుంచి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ని రంగంలోకి దించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టిన‌ట్లు తెలుస్తోంది . ర‌జ‌నీకాంత్ తో అట్లీ చ‌ర్చ‌లు జ‌రుపుతు న్న‌ట్లు స‌మాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇదే భారీ మ‌ల్టీస్టార‌ర్ అవుతుంది. నార్త్ బెల్ట్ నుంచి సునాయాసంగా 500 కోట్లు కొల్లగొట్ట గల స్టార్ స‌ల్మాన్. ఇక సౌత్ నుంచి సూప‌ర్ స్టార్ 500 కోట్లు తేగ‌ల‌రు. వారిద్ద‌రు క‌లిస్తే పాన్ ఇండియా వైడ్ ఎంత సంచ‌ల‌నమవుతుందో చెప్పాలాల్సిన పని లేదు. అయితే అట్లీ ప్ర‌పోజ‌ల్ ని సూప‌ర్ స్టార్ అంగీక‌రిస్తారా అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది . సూప‌ర్ స్టార్ గా ఎదిగాక ర‌జ‌నీకాంత్ ఇత‌ర హీరోల‌తో క‌లిసి ప‌నిచేయ‌లేదు. పాన్ ఇండియా నుంచి పాన్ వ‌ర‌ల్డ్ వ‌ర‌కూ సోలోగానే రీచ్ అయ్యారు. అలాంటి ర‌జ‌నీని ఇప్పుడు మ‌రో స్టార్ తో క‌లిసి సినిమా చేయ‌డం అంటే చాలా విష‌యాలు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. తొలిసారి రజినీతో మల్టీస్టార్ మూవీ చేయాలనుకుంటున్న అట్లీ ప్లాన్ ఎంత వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. సూప‌ర్ స్టార్- స‌ల్మాన్ ఖాన్ సినిమా చేస్తే మాత్రం రిలీజ్ కి ముందే పెద్ద సంచ‌ల‌న‌మ‌వుతుంది. ఆ కాంబినేష‌న్ చేతులు క‌ల‌పాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించ‌డానికి రెడీగా ఉంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకుంటున్నారు.