నాగార్జునకి సంక్రాంతి సెంటిమెంటు ఉంది. గతంలో సంక్రాంతి పండుగకి వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. అందువలన ఆయన ఈ సారి సంక్రాంతి బరిలో కూడా తన సినిమా ఉండేలా చూసుకున్నారు. నిజానికి ఈ సినిమా ఈ నెల 5వ తేదీనే షూటింగును పూర్తి చేసుకుంది. అందువలన ఈ సినిమా, పండగకి రాకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది. కానీ నాగార్జున మాత్రం అనుకున్నది సాధించారు. నిన్ననే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని, U/A సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో మరింత హైప్ తెచ్చుకున్న ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేసుకుంది. ఈ రోజున హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్స్ లో ఈ వేడుకను జరపనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం మొదలు కానుంది. 
ఈ విషయాన్ని తెలియజేస్తూ కొంతసేపటి క్రితమే అధికారిక పోస్టర్ ను వదిలారు.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాలో అల్లరి నరేశ్ .. రాజ్ తరుణ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఇక ఆషిక రంగనాథ్ .. రుక్సార్ థిల్లాన్ .. మిర్నా కథానాయికలుగా అలరించనున్నారు. కీరవాణి అందించిన బాణీలు ఇప్పటికే పాప్యులర్ అయ్యాయి. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.