adipurush collection

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని కొన్ని డైలాగులపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ క్రమంలో తనకు ప్రాణహాని ఉందంటూ సినిమాకు డైలాగులు రాసిన మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు భద్రతను కల్పించాలని కోరారు. ఆయన భద్రతను కోరిన వెంటనే పోలీసు అధికారులు స్పందించారు. మనోజ్ కు భద్రతను కల్పించారు. పరిస్థితిని తాము పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. 

మరోవైపు మనోజ్ మాట్లాడుతూ, తాను రాసిన డైలాగుల్లో తప్పులేదని చెప్పడానికి లెక్కలేనన్ని కారణాలను తాను చెప్పగలనని అన్నారు. అయితే, అందరి ఫీలింగ్స్ ను పరిగణనలోకి తీసుకుని డైలాగ్స్ ను మార్చాలని దర్శకనిర్మాతలు నిర్ణయించారని చెప్పారు. కొత్త డైలాగులను ఈ వారంలో చేరుస్తామని చెప్పారు

Previous articleరవితేజ సినిమా కోసం మళ్లీ 
Next articleఉపాసనకు పుట్టబోయే బిడ్డ కోసం