రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్‌గా ‘రాజా వారు రాణి గారు’ ఫేమ్ రవికిరణ్ కోలాతో ఓ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ స్టార్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ దిల్ రాజు మరోసారి విజయ్‌తో ఈ మూవీ చేస్తున్నాడు. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో సాయి పల్లవిని హీరోయిన్‌గా తీసుకోవాలని, ఈ పాత్రకి సాయి పల్లవి అయితేనే కరెక్ట్‌గా ఉంటుందని డైరెక్టర్ అనుకుంటున్నారట. అందులోనూ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకునే ఈ క్యారెక్టర్‌ను రవికిరణ్ రాశారట. పైగా కథనంలో ఈ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, దీంతో సాయి పల్లవిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోవాలని మూవీ టీమ్ ప్రయత్నిస్తుంది. కాగా సాయి పల్లవి ఇప్పటివరకూ విజయ్ దేవరకొండతో నటించకపోవటంతో ఈ చిత్రం గనుక ఓకే చేస్తే వీరిద్దరి జోడి స్క్రీన్‌పై ఫ్రెష్ లుక్ తీసుకొస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. గతంలో సాయి పల్లవి దిల్ రాజు బ్యానర్‌లో ఫిదా, ఎంసీఏ సినిమాల్లో నటించింది. కాబట్టి ఈ చిత్రానికి సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద కష్టమేమీకాకపోవచ్చు కానీ విజయ్ సినిమాల్లో లిప్ లాక్ ఉండటం సహజం. కానీ సాయి పల్లవి ఇలాంటి సన్నివేశాల్లో అస్సలు నటించదు. ఇప్పుడు ఇదే రౌడీ ఫ్యాన్స్‌ని కాస్త టెన్షన్ పెడుతుంది. ఈ ప్రాజెక్టులో సాయి పల్లవి కోసమైనా అలాంటి సీన్ పెట్టకుండా ఉంటారేమో చూడాలి. ‘రౌడీ జనార్దన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా అన్నీ కుదిరితే త్వరలోనే సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.