prabhas maruthi film
prabhas maruthi film

ప్రభాస్.. ఇటీవలే ‘ఆదిపురుష్’ అనే సినిమాతో వచ్చాడు. ఇక, ఇప్పుడు ఈ బడా హీరో ‘సలార్’, ‘ప్రాజెక్టు K’, ‘స్పిరిట్’తో పాటు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితోనూ ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం మారుతితో కలిసి చేస్తున్న మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే వార్తలు లీక్ అయ్యాయి. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా ఎంతో సీక్రెట్‌గా సాగుతోంది. ఇందుకోసం ఓ బూత్ బంగ్లా సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ను జరుపుకుంటోన్నారు. ఇలా ఇప్పటికే దాదాపుగా 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేశారు. మిగిలిన దాన్ని కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకునేలా చిత్ర యూనిట్ ప్లాన్లు చేసుకుంటోంది.

హర్రర్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాకు ‘రాజా డీలక్స్’ అనే పేరును పెడుతున్నట్లు ఆరంభం నుంచీ ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ తర్వాత మరికొన్ని టైటిళ్లు కూడా తెరపైకి వచ్చాయి. వీటిలో ‘అంబాసీడర్’ అనే పేరు దాదాపుగా ఖాయం అని టాక్ వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ – మారుతి కాంబోలో వస్తున్న ఈ చిత్రానికి ‘రాయల్’ (Royal) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇప్పటికే ఈ పేరును చిత్ర నిర్మాతలు ఫిలిం చాంబర్‌లో సైతం రిజిస్టర్ చేయించారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.