ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తోన్న ‘పుష్ప‌-2’  షూటింగ్ ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా షూటింగ్ సెట్‌లో ఉన్న హీరోయిన్ ర‌ష్మిక మందాన లుక్ లీకైంది. శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టిస్తోన్న నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక ఎరుపు రంగు చీర‌లో బంగారు ఆభ‌ర‌ణాలు ధ‌రించి ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఈ ఫొటోను అభిమానులు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. 

ఇదిలాఉంటే.. ఇటీవ‌ల యాగంటి ఆల‌యంలో ఈ మూవీ షూటింగ్ విశేషాల‌ను త‌న‌ ఇన్‌స్టా స్టోరీలో ర‌ష్మిక అభిమానుల‌తో పంచుకుంది. షూటింగ్ స్పాట్‌లో తీసిన ఫొటోను కూడా షేర్ చేసింది. “ఇవాళ ఈ దేవాల‌యంలో మూవీ చిత్రీక‌ర‌ణ‌ జ‌రిగింది. యాగంటి అని పిల‌వ‌బ‌డే ఈ ఆల‌య స్థ‌ల పురాణం  నిజంగా చాలా అద్భుతం. ఇక్క‌డి ప్ర‌జ‌లు, వారి ప్రేమ మాట‌ల్లో చెప్ప‌లేం. ఈ రోజు చాలా అద్భుతంగా గ‌డిచింది” అని చెప్పుకొచ్చింది.