rajamouli mahesh babu movie
rajamouli mahesh babu movie

మహేష్‌ జక్కన్న కాంబో.. నుంచి మరో దద్దరిల్లిపోయేలాంటి న్యూస్ బయటికి వచ్చింది. ఇప్పుడదే మహేష్ అభిమానుల్లో జోష్‌ను నింపేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో… అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో… మహేష్‌ హీరోగా జక్కన్న ఓ సినిమాను తెరకెక్కించేందుకు ట్రిపుల్ ఆర్ ముందే ప్లాన్‌ చేశారు. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో.. స్టోరీని ఫైనలైజ్‌ చేయించి.. నిన్న మొన్నటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పుడేమో.. ఏకంగా షూటింగ్‌ బిగిన్స్‌కు డేట్ ఫిక్స్‌ చేశారనే ఇంటర్నల్ టాక్‌తో.. అందర్నీ ఒక్క సారిగా తన వైపుకు తిప్పుకున్నారు జక్కన్న. అవును! సూపర్ స్టార్ మహేష్ బర్త్‌ డే ఆగస్టు 9 రోజే..ఈ మూవీ షూటింగ్‌ను గ్రాండ్ మొదలెట్టే ఆలోచన చేస్తున్నారట జక్కన్న. బాబు బర్త్‌ డే ఈ మూవీ షూట్‌ను లాంచ్‌ చేయనున్నారట. దాంతో పాటే.. ఓ అఫీషియల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసేందుకు ఆలోచన చేస్తున్నారట జక్కన్న.

Previous articleతెలంగాణాలో మళ్ళీ ఐటీ దాడులు
Next articleపవన్ దెబ్బకు బీజేపీ దిగొచ్చిందా?