Home Telangana తెలంగాణాలో మళ్ళీ ఐటీ దాడులు

తెలంగాణాలో మళ్ళీ ఐటీ దాడులు

తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వ్యాపార వర్గాలను, రాజకీయ ప్రముఖులను టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ దాడులు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. తాజాగా బీఆర్ఎస్ నేత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పై ఐటి దాడులు కలకలం రేపుతున్నాయి.ఈరోజు ఉదయం నుండి 70 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హైదరాబాద్లోని ఆయన ఇల్లు, ఆఫీసులలో తనిఖీలు చేపడుతున్నాయి. అలాగే శేఖర్ రెడ్డి దగ్గర పనిచేసే సిబ్బంది ఇళ్లల్లో కూడా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.దాదాపు 70 ప్రత్యేక ఐటీ బృందాలు ఏకకాలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో తనిఖీలు చేపడుతున్నారు.ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీలలో బినామీగా ఉన్నాడని, 15 కంపెనీలలో పెట్టుబడి దారుడుగా ఉన్నారని సమాచారం