ప్రభాస్, కమలహాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పఠానీలాంటి తారాగణంతో దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ కే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2024 జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ చిత్రం గురించి ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈ సినిమా మన దేశ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయాన్ని సాధిస్తుందని… తొలిరోజే రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల కలెక్షన్లను వసూలు చేస్తుందని ఆయన అంచనా వేశారు. అయితే అది ఈ సినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ చేసే ప్రచార కార్యక్రమాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఈ చిత్రం టాప్ 50 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు.