తెలుగు సినిమా ప్రపంచంలోకి ఒక సుడిగాలిలా .. సునామీలా చిరంజీవి దూసుకొచ్చారు. హీరోగా సరైన బ్రేక్ వచ్చేవరకూ నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలను సైతం పోషిస్తూ వెళ్లారు. ఆల్రెడీ బరిలో ఉన్న స్టార్ హీరోలకు పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుని, అంచలంచెలుగా ఎదుగుతూ వెళ్లారు. తెలుగు సినిమా కథలను .. పాటలను .. డాన్సులను .. ఫైట్లను పరిగెత్తించారు. అంతగా ప్రభావితం చేసిన హీరో ఇంతవరకూ మళ్లీ రాలేదనే చెప్పాలి. 

అలా 150కి పైగా సినిమాలను పూర్తి చేసుకున్న చిరంజీవి, కొత్త దర్శకులను .. కొత్త నటులను ప్రోత్సహిస్తూ ముందుకు వెళుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలోని పేద కళాకారులను ఆదుకుంటూనే, అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి మెగాస్టార్ ను ‘పద్మ విభూషణ్’ పురస్కారం లభించింది. దాంతో పరిశ్రమలో పండగ వాతావరణం నెలకొంది.