పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న ఈ చిత్రం ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుంది. అందుకు తగ్గట్లుగానే దీన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు.’బ్రో (BRO)’ మూవీని జూలై 28న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దీనికి సమయం దగ్గర పడడంతో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టబోతున్నారు. ఇలా మరికొద్ది రోజుల్లోనే టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇక, తాజా సమాచారం ప్రకారం..ఈ సినిమా విడుదలకు ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో జరపాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఎందుకంటే పవన్ కల్యాణ్ ఇప్పుడు గోదావరి జిల్లాల్లోనే వారాహి యాత్రను చేస్తున్నాడు. అక్కడి నుంచి సినిమా ప్రమోషన్ కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. అతడి సూచన మేరకే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి మార్చారని తెలిసింది.

Previous articleలోకేష్ vs అనిల్‌
Next articleప్రభాస్ మూవీకి ‘రాయల్’ టైటిల్