నెల్లూరు యువగళం పర్యటనలో భాగంగా నాయుడుపేట సభలో నారా లోకేష్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కి సవాల్ విసిరారు. వచ్చేసారి నెల్లూరు సిటీ టికెట్ నీదే అని జగన్ తో చెప్పించగలవా అని ఛాలెంజ్ చేశారు. సిల్లీ బచ్చా, హాఫ్ నాలెడ్జ్.. అంటూ కౌంటర్ ఇచ్చారు. ఆ సిల్లీ బచ్చా నాతో చర్చ అంటూ సరదా పడుతున్నాడంట.. రా రా వచ్చెయ్ అంటూ నాయుడుపేట సభ నుంచి పిలుపునిచ్చారు నారా లోకేష్. అవినీతి సొమ్ముతో ఆయన కొన్న పొలం దగ్గర చర్చ పెట్టుకుందామా అని అడిగారు. చర్చకు వచ్చేటప్పుడు జగన్ ని కూడా తీసుకు రావాలన్నారు. తాను నాయుడుపేటలోనే ఉన్నా వచ్చెయ్ అంటూ పిలిచారు లోకేష్.

 ఎన్నికల్లో నెల్లూరు సిటీ సీటు ఆయనకి ఇస్తారా అని ప్రశ్నించారు. అలా ఇస్తారని సీఎం జగన్ తో చెప్పించగల దమ్ము అనిల్ కి ఉందా అని ప్రశ్నించారు. 

ఇటీవల అనిల్, ఆనం మధ్య రాజీనామాల సవాళ్లు వచ్చాయి. దమ్ముంటే తనతో పోటీకి రావాలని ఇరువురు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ తాను నెల్లూరు సిటీ నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. అలా ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకోవడంపై TDP నేతలు సెటైర్లు పేలుస్తున్నారు. వచ్చేసారి అనిల్ కి నెల్లూరు సిటీ సీటు JAGAN ఇవ్వరని చెబుతున్నారు. అనిల్ కి టికెట్ క్యాన్సిల్ అయిందని, అందుకే ఆయన ఫ్రస్టేషన్లో అలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.