గత కొన్ని రోజులుగా పవన్‌పై వైసీపీ నేతలు ఎక్కువ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా పేర్ని నాని, అమర్నాథ్‌, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ విమర్శల దాడి పెంచారు. వీళ్లకు సపోర్ట్‌గా ముద్రగడ పద్మనాభం లేఖలు రాస్తూ సవాళ్లు విసిరారు. 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టలేరని… కనీసం తన సీటు ఎక్కడో కూడా తెలియదని ఎద్దేవా చేస్తూ వస్తున్నారు.అందరికీ కలిపి ఒకే సమాధానం ఇచ్చారు జనసేనాని. తాను పోటీ చేసిన చోటు చెప్పకపోయినా అసలు ఉమ్మడి ఈస్ట్, వెస్ట్‌లో వైసీపీ ఒక్కసీటు కూడా గెలవకుండా చేస్తానంటూ చెప్పుకొచ్చారు. జనసేనని ఎవరు ఆపుతారో చూస్తానంటూ సవాల్‌ చేసిన వాళ్లకు ప్రతి సవాల్ చేశారు.  మలికిపురం బహిరంగ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తానంటూ ప్రకటించారు. తాను పోటీ చేయడం పక్కన పెడితే గోదావరి జిల్లాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చేస్తానంటూ ప్రతినబూనారు. జనసేన ఎదుగుదలను ఎలా అడ్డుకుంటారు.. మీ ఇసుక దోపిడీ, మీ దౌర్జన్యాలను అడ్డుకోకపోతే తనపేరు పవన్‌ కళ్యాణ్‌ కాదు అన్నారు. దేవాలయాలను కాల్చేసిన వారిని మీరు వెనుకేసుకొస్తారు. సొంత చిన్నానను చంపిన అనకొండ అని సంచలన ఆరోపణలు చేశారు. దళితులకు మేనమామ అనే చెప్పుకుని దళిత పథకాలు తీసేశారని సీఎంపై పవన్ సెటైర్లు వేశారు. విదేశీ విద్య పథకానికి ‌jagan పేరు పెట్టుకున్నారు, అంబేడ్కర్‌ కంటే మీరు గొప్పవారు కాదు అన్నారు.