సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం గుంటూరు కారం. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి వస్తున్న రూమర్స్ మరే మూవీపై రావట్లేదు. ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఔట్ అంటూ వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ రూమర్స్ పై ట్విట్టర్ వేదికగా ఇచ్చిపడేశాడు తమన్. అలాగే ఈ మూవీ నుంచి హీరోయిన్ పూజా హెగ్డే సైతం తప్పుకుందని టాక్ నడుస్తోంది. ఈ సినిమా కోసం కేటాయించిన డేట్స్ పూజా అడ్జస్ట్ చేయలేకపోయిందని.. దీంతో ఆమె స్థానంలో సెకండ్ హీరోయిన్గా నటిస్తున్న శ్రీలీలను తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు ఈ రూమర్స్ పై చిత్రయూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల నటించనుందని టాక్ నడిచింది. అయితే పూజా స్థానంలోకి శ్రీలీల కాకుండా హీరోయిన్ మీనాక్షి చౌదరిని తీసుకున్నారని తెలుస్తోంది. అలా కాకుండా.. మెయిన్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుందని.. సెకండ్ కథానాయికగా మీనాక్షిని తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. మరీ ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే చిత్రయూనిట్ నుంచి ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.