తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది. ఈమేరకు ఈసీ విడుదల చేసిన ప్రకటనలో.. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగించనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని మిగతా 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ వెల్లడించింది. ఆ 13 నియోజకవర్గాలు.. సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే పోలింగ్‌ జరగనుంది.