రాజమండ్రిలో టీడీపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం ప్రారంభమైంది. హోటల్ మంజీరా వేదికగా ఈ పొత్తు సమావేశం కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులను నారా లోకేశ్ జనసేనాని పవన్ కల్యాణ్ కు పరిచయం చేశారు. జనసేన సభ్యులను లోకేశ్ పేరుపేరునా పలకరించారు. కనీస ఉమ్మడి కార్యక్రమం సహా 6 అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలన, జాబితాలో అవకతవకలపై బూత్, జిల్లా స్థాయి జేఏసీ కమిటీల ఏర్పాటుపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ వివిధ సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందించనుంది. సమావేశం ప్రారంభం కాగానే, చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ సమన్వయ కమిటీ తీర్మానం చేసింది. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని ఇరు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.