టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ప్రముఖ కోలీవుడ్ సినీ హీరో విశాల్ స్పందించారు. చంద్రబాబు గొప్ప నాయకుడని… అలాంటి నాయకుడికే ఇలాంటి పరిస్థితి వస్తే, సామాన్యుడి పరిస్థితి ఏమిటని అన్నారు. చంద్రబాబు పరిస్థితిని చూస్తుంటే తనకే భయం వేస్తోందని తెలిపారు. చంద్రబాబు నిజాయతీ గల నేత అని చెప్పారు. అలాంటి నేతకు ఇలాంటి దుస్థితి రావడం బాధను కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ బాధాకరమని, ఆయనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ పై స్పందించిన సంగతి తెలిసిందే. తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాటయోధుడని ఆయన అన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును కలవాలనుకున్నానని… అయితే, ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా అది కుదరలేదని చెప్పారు.