ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడనున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ పేర్కొన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో రాష్ట్ర భవిష్యత్తుకు గ్యారెంటీ, ప్రజలకు భరోసా కలుగుతాయన్నారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా వైసీపీ చాలా కుట్రలు చేసిందని ఆరోపించారు. ఆ కుట్రలు ఫలించకపోవడంతో వైసీపీకి భయం పట్టుకుందని, ముఖ్యమంత్రి జగన్ ముఖంలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం కావడంతో జగన్ లో టెన్షన్ మొదలైందని చెప్పారు. పొత్తులో భాగంగా టీడీపీ.. లోక్ సభ-17, అసెంబ్లీ-144, జనసేన.. లోక్ సభ-2, అసెంబ్లీ-21, బీజేపీ.. లోక్ సభ-6, అసెంబ్లీ-10 సీట్లలో పోటీ చేస్తాయని దేవినేని ఉమ వెల్లడించారు.