తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల కల సాకారమైన జూన్ 2 మనందరికీ పండుగ రోజని పవన్ అన్నారు .. ఎంతోమంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతం అంటే తనకెంతో ఇష్టమని చెప్పే పవన్.. 2019 లోక్ సభ ఎన్నికల్లోనూ తన పార్టీ తరఫున తెలంగాణలో అభ్యర్థులను బరిలో నిలిపిన విషయం తెలిసిందే . అనేకమంది యోధుల త్యాగ ఫలంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పర్వదినాన తెలంగాణ బిడ్డలందరికీ తన పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు పవన్ కళ్యాణ్ . తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన అమరులకు ఈ సందర్బంగా ఆయన అంజలి ఘటిస్తున్నట్టు చెప్పారు . అభివృద్ధి ఫలాలు అందరికీ అందిననాడే వారికి నిజమైన నివాళి అని , నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల మాటలు మరో మారు నిజం కావాలని కోరుకుంటున్నానని అన్న పవన్ కళ్యాణ్ సందేశాన్ని జనసేన ట్వీట్ చేసింది. ఇక పిరపురంలో పవన్ కళ్యాణ్ బారి మెజారిటీ తో గెలవబోతున్నట్టు కొన్ని సర్వేలు చెప్పటంతో జన సైనికులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలని తెలుగు ప్రజలందరూ కోరుకుంటున్నారు