జనసేన అధినేత పవన్ మంగళగిరిలోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య అన్నా లెజినోవాతో కలిసి ఆయన పోలింగ్ బూత్ కు వెళ్లారు. పోలింగ్ బూత్ కు పవన్ వచ్చారనే సమాచారం తెలిసిన అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. సీఎం పవన్ అంటూ అంటూ వాళ్లు నినాదాలు చేశారు. మరోవైపు జనసేనను వీడి వైసీపీలో చేరిన పోతిన మహేశ్… పవన్ ను తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే. పవన్ వేల కోట్లు సంపాదించారని… పవన్ బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను తాను బయటపెడతానని కూడా అన్నారు. మూడో భార్య అన్నా లెజినోవా మీతోనే కలిసి ఉంటే పిఠాపురంలో కొత్త ఇంటి పూజా కార్యక్రమాలకు సతీసమేతంగా రావాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోతినపై నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘భార్యతో కలిసి పవన్ ఓటు వేశారు… కాస్త కళ్లు తెరిచి చూడు పోతిన మహేశ్’ అని ఎద్దేవా చేస్తున్నారు.