తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఓటరుపై చేయి చేసుకున్న ఘటనను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తోంది. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. పోలింగ్ పూర్తయ్యే వరకు ఎమ్మెల్యే శివకుమార్ ను గృహ నిర్బంధంలో ఉంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. 

తెనాలిలో ఈ ఉదయం ఓ పోలింగ్ బూత్ వద్దకు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వచ్చారు. ఆయన బూత్ లోకి వెళుతుండగా, క్యూలైన్ లో ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి అభ్యంతరం చెప్పారు. లోపలికి వెళ్లొద్దని అన్నారు. క్యూ లైన్ నుంచి కాకుండా, నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లడం ఏంటని ఎమ్మెల్యేని సుధాకర్ నిలదీశారు.