ఏపీలో ఇవాళ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. అందరి దృష్టి కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కల్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. 

కాగా, ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చిన వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు. అతడు మెడలో ఎర్ర కండువా వేసుకుని రావడమే అందుకు కారణం. అయితే, అతడు జనసేనకు మద్దతుగా ఆ ఎర్ర కండువా వేసుకొచ్చాడంటూ ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. 

అయితే, ఇది గుడ్డ అంటూ ఆ వ్యక్తి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వంగా గీతతో పాటు, అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. అతడిని అక్కడ్నించి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం జనసేన శతఘ్ని ట్వీట్ చేసింది.