ఈ ఎన్నికల్లో పిఠాపురం నుండి బరిలోకి దిగుతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించినప్పటినుండి అందరి ద్రుష్టి ఆ నియోజకవర్గం పైనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాదు తెలంగాణలో కూడా పవన్ పోటీ, గెలుపుపై ఆసక్తికర చర్చ సాగుతోంది .ఈ సారి ఆయన గెలవాలని జనసైనికులే కాదు సాధారణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు.. ఈ క్రమంలో ఎన్నికలు కూడా ముగిశాయి. సోమవారం పోలింగ్ పూర్తికాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలోని ఓటర్లు ఉత్సాహం కనబరిచారు.. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల సంగం తెలిపింది . ఈ ఏకంగా 86.63శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో పిఠాపురంలో 80.92శాతం, 2014లో 79.44శాతం ఓటింగ్ నమోదైంది. అయితే ఈసారి గత రెండు ఎన్నికల కంటే రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి గ్రౌండ్ వర్క్ మొదలైంది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు ఓటు వేసేందుకు యువత, ఉద్యోగులు, విద్యార్థులు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. ఇంకొంతమంది విదేశాల నుంచి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవటంతో పోలింగ్ శాతం భారీగా నమోదైనట్లు తెలుస్తోంది . దీంతో పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని జనసైనికులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన గెలుపును పిఠాపురం ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.