టీడీపీ అధినేత చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొన్ని మద్యం డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారంటూ సీఐడీ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ3గా చేర్చుతూ ఏసీబీ కోర్టులో ఇటీవలే సీఐడీ పిటిషన్ వేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఏ2గా ఉన్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు, కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

చంద్రబాబు, కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా కొద్దిసేపటి క్రితం వాదనలు ప్రారంభం అయ్యాయి. ప్రస్తుతం చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబుపై ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే.