రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేసుల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి.. అయితే తాజాగా దీనిపై మంత్రి కోమటి రెడ్డి వెంకరెడ్డి స్పందించారు. హరీష్ రావు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావును కలిసేందుకే వెళ్లాడని.. ప్రభాకర్ రావు ఇండియాకు వస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు వెళుతుందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. బీఆర్ఎస్ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్‌ను ప్రపంచంలో ఎవరూ చేయలేని నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్ చేయించారని, ప్రభాకర్ రావు అనే రిటైర్ట్ అధికారిని అడ్డం పెట్టుకొని ఆయన కింద ఓ రౌడీ గ్యాంగ్ రాధకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న అనే రౌడీలతో వ్యాపారవేత్తలు, నాయకులను బెదిరించి లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ మంత్రులమని చెప్పుకోవాలంటేనే సిగ్గుపడే స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ రావును కేసీఆర్ అమెరికా పంపాడంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఆయన ఇండియా వస్తే.. కేసీఆర్ ఫ్యామిలి మొత్తం జైలుకు వెళ్లాల్సి వస్తుందని తెలిసి.. రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేవరకు ఇండియా రావద్దని ప్రభాకర్ రావుకు చెప్పడానికే హరీష్‌ రావును అక్కడికి పంపాడని తెలిపారు. హరీశ్ రావు అమెరికా వెళ్లినట్టు తన వద్ద ఆధారాలున్నాయని, ఒకవేళ ప్రభాకర్ రావు ని కలవకపోతే హరీష్ రావు ప్రమాణం చేయాలంటూ సవాల్ విసిరారు. . కవితకు బెయిల్ కోసం లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేలా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని కోమటిరెడ్డి కీలక ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు అన్నిచోట్ల బీజేపీకే ఓట్లు వేయించారని ఆయన అన్నారు