బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పార్టీని వీడుతున్నట్టు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆ పార్టీలో చేరుతారనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ స్పందిస్తూ… ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ నాయకులతో తాను టచ్ లో లేనని చెప్పారు. ఇటీవల తాను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి వార్తలు చక్కర్లు కొట్టాయని చెప్పారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. రెండు రోజులుగా తాను పూణేలో ఉన్నానని తెలిపారు.

Previous articleపల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై దాడి
Next articleఅర్చకులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం