ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది .. దీంతో వైసీపీ హయాంలో ఉన్న పథకాల పేర్లు ఒక్కొక్కటి మారుస్తోంది .. అయితే గతంలో 2019 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటి వరకూ ఉన్న సంక్షేమ పథకాల పేర్లన్నీ మార్చేశాడు . పథకాలన్నింటికీ జగనన్న, వైఎస్సార్ పేర్లతో అమలు చేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకతో 2014 నుంచి 2019 వరకూ ఉన్న కొన్ని పథకాల పేర్లు కంటిన్యూ చేసి మరికొన్నింటికీ మార్పులు, చేర్పులు చేసింది. ఈ క్రమంలో సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా వీరాంజనేయులు స్వామి ఆదేశాలు జారీ చేశారు . ఈ  మేరకు ఉన్నతాధికారులు పేర్లు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  జగనన్న విద్యా, వసతి దీవెనల పథకాలకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్‌గా, జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్పు చేశారు. ఇక వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్సార్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్పు చేశారు. కాగా జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రొత్సాహాకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలుగా పథకం అమలు చేశారు..