GunturuKaaram
GunturuKaaram

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీలీల పేరే కనిపిస్తోంది. వరుస సినిమాలతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె బాలకృష్ణ .. పవన్ కల్యాణ్ .. మహేశ్ బాబు నితిన్ రామ్ విజయ్ దేవరకొండ వైష్ణవ్ తేజ్నవీన్ పోలిశెట్టి సినిమాలతో బిజీగా ఉంది. ఈ జాబితాలో బాలకృష్ణ సినిమాలో మాత్రం ఆయన కూతురిగా కనిపించనుంది.ఇక ఈ సినిమాల కంటే ముందు శ్రీలీల చేసిన సినిమాఅవకాశాలు ఆమెకి ఈ రేంజ్ లో వచ్చి పడటానికి కారణం ‘ధమాకా’. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఆమె చేసిన ఈ సినిమా, కథాకథనాల పరంగా మ్యూజికల్ హిట్ గాను నిలిచింది. శ్రీలీల డాన్సులు కూడా ఇరగదీస్తుందనే పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆమె రవితేజ సరసన నటించనున్నట్టుగా తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు .. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసమే శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే మరోసారి మాస్ మహారాజ్ అభిమానులకు పండగే.