adipurush collection
adipurush collection

రామాయణ కథాంశంతో ప్రభాస్ రాముడిగా తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్. కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు.రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.రామాయణ కథ కావడంతో దేశవ్యాప్తంగా మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.దీంతో ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.ఇండియా వైడ్ ఈ చిత్రాన్ని 4000 పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు.అలాగే మొదటి రోజు అదనపు షోలు కూడా పడనున్నాయి. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ చూసే అవకాశం ఉంది. ఇప్పటికే మూవీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యి, టికెట్లు కూడా చాలా స్పీడ్ గా అమ్ముడు పోతున్నాయి. తెలుగు స్టేట్స్ లోని 3D థియేటర్ టికెట్స్ మొత్తం దాదాపు అమ్ముడు పోయినట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ ట్రేడ్ పండితులు అంచనాలు ప్రకారం.. ఈ మూవీ మొదటిరోజు 75 నుంచి 100 కోట్లు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే.. మొదటి వీకెండ్ పూర్తి అయ్యేప్పటికీ 150 నుంచి 200 కోట్లు కలెక్షన్స్ చేయవచ్చని చెబుతున్నారు.కాగా ఢిల్లీలో ఈ సినిమా టికెట్స్ ని రూ.2200 లకు అమ్ముతున్నారు. డైరెక్టర్ వెర్షన్ సినిమాని ఢిల్లీలోని PVR థియేటర్ లో ప్రదర్శిస్తున్నారు. ఆ టికెట్ ని 2200 రూపాయలకు అమ్ముతున్నారు. అయినాసరి అక్కడ హౌస్ ఫుల్ అవ్వడం గమనార్హం. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా టికెట్ ధర పై 50 రూపాయిలు పెంచుకునే అవకాశం ఇచ్చారు. ఏపీలో 10 రోజుల పాటు ఈ ధర పెంపు ఉంటే, తెలంగాణలో మొదటి మూడు రోజులు మాత్రమే ధర పెంపు ఉందనుంది. మరి భారీ అంచనాలు మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.