‘కల్కి 2898 AD’ ప్రభాస్ నటిస్తున్న భారీ పాన్ వ‌ర‌ల్డ్ చిత్రం కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు . ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రాజా సాబ్ అనే చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్ర‌భాస్ ప్ర‌శాంత్ నీల్ స‌లార్ 2 లో న‌టిస్తున్నాడు.ఆ తర్వాత తన ప్రభాస్ ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు హను రాఘవపూడితో ఓ సినిమాకి క‌మిటయ్యాడు . అయితే హ‌నుతో సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న‌దానికి స‌రైన స్పష్ఠ‌త రాలేదు. అయితే తాజాగా ఓ ఈవెంట్‌కి హాజరైన హను రాఘవపూడి ప్రభాస్ తో త‌న‌ సినిమాని అధికారికంగా ఖ‌రారు చేసారు. అంతేకాదు ఈ సినిమా చ‌రిత్ర ఆధారంగా రూపొందే పీరియాడికల్-యాక్షన్ చిత్రమ‌ని వెల్ల‌డించారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ఇప్పటికే మూడు ట్యూన్స్ ఇచ్చారని దర్శకుడు హ‌ను వెల్లడించారు. అత్యంత‌ భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ‘స‌లార్ 2’ కోసం భారీ ఈత కొల‌ను ప్ర‌శాంత్ నీల్ తో ప్ర‌భాస్ ‘సలార్-2’ చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే మొదలైంది. ఓవైపు ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతుండ‌గానే, త‌దుప‌రి యాక్షన్ షెడ్యూల్ కోసం భారీ స్విమ్మింగ్ పూల్‌ సెట్ ను వేస్తున్నారని క‌థ‌నాలొస్తున్నాయి. సముద్ర నేపథ్యంలో సాగే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా తెర‌కెక్కించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఏప్రిల్ లో పార్ట్-2ని ప్రారంభించి 2025లో రిలీజ్‌ చేస్తామని గ‌తంలో హోంబ‌లే అధినేత విజ‌య్ కిరంగ‌దూర్ అన్నారు. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్ రేంజులో ఈ సినిమాలో యాక్ష‌న్ కంటెంట్ ఉంటుందని సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది.