ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృంష్టించిన పేరు పవన్ కళ్యాణ్ .. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాలలో గెలిచి తన సత్తా ఏంటో చాటుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఏపీ కి ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా మరో నాలుగు శాఖల్ని ఏరి కోరి మరీ తీసుకున్నాడు.. అందులో రెండు శాఖల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి . ఒకటి పంచాయతీ రాజ్ , రెండోది గ్రామీణాభివృద్ధి శాఖ. పవన్ కళ్యాణ్ హోమ్ శాఖ తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఆయనకు ప్రజాసేవ ఇష్టం . ప్రజలకు దగ్గరగా ఉండటం ఇష్టం . అభివృద్ధి దిశగా గ్రామాలను , ప్రజలను నడిపించాలనే సదుద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఆ రెండు శాఖలు తీసుకున్నారు. పల్లెటూళ్ళు బాగుంటేనే అందరూ సుభిక్షంగా ఉంటారని నమ్మే వ్యక్తి పవన్ కళ్యాణ్. పంచాయతీ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా ప్రజలకు చేరువగా ఉండొచ్చు. పల్లెల అభివృద్ధితో పాటు , అక్కడ ఉండే యువతకు స్కిల్ డెవలప్ చేయొచ్చు .. అసలు యువత ఏం కోరుకుంటారు .. పల్లెలకు గ్రామాలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరం ఇలాంటి అంశాలన్నీ ఆ రెండు శాఖలతో ఇమిడి ఉంటాయి. అందుకే పవన్ కళ్యాన్ ఆ శాఖల్ని తీసుకున్నారు. పల్లెలను , గ్రామాలను అభివృద్ధి చేస్తూ తన మార్క్ చూపించాలనే ఉద్దేశ్యంతోనే పవన్ కళ్యాణ్ ఆ రెండు శాఖల్ని మరీ అడిగి తీసుకున్నారు. ఇక పంచాయతీ రాజ్ శాఖ చాలా కీలకమైనది. దీని ద్వారా అన్ని ఊర్లకి పథకాలు అందిస్తూ పల్లెటూళ్ళని పట్టుకొమ్మలుగా చూపిస్తూ తాను కోరుకున్న అభివృద్ధి వైపు అడుగేయాలన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఇక ఆయన ఎంచుకున్న పర్యావరణ శాఖ కూడా ముఖ్యమైనదే. చెట్లు , ప్రకృతి అంటే పవన్ కళ్యాణ్ కి చాల ఇష్టం . ఓ సారి ఆయన సినిమా షూటింగ్ లో ఒక చెట్టు అడ్డు వస్తుందని యూనిట్ సభ్యులు నరికేయటానికి ప్రయత్నించగా వద్దని వారించిన వ్యక్తి పవన్ కళ్యాణ్. పర్యావరణాన్ని కాపాడాలనే మంచి మనసుతోనే పవన్ కళ్యాణ్ ఈ శాఖని ఎంచుకున్నారు.ప్రజలతో నడిచి , ప్రజల కష్టాలు తీర్చాలనే గొప్ప ఆలోచనతోనే ప్రజలతో అనునిత్యం మమేకమై ఉండే శాఖల్ని పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు.