ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సినిమా కాంతారా. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా ఈ చిత్రం నిలిచింది. అంతేకాదు సినిమా హల్లో క్లైమాక్స్ లో ప్రేక్షకులకు కాంతారా పూనకాలు తెప్పించింది. ఇక మొదట కన్నడ భాషలో రిలీజైనప్పుడు పెద్దగా టాక్ వినిపించలేదు. కానీ ఒరిజినల్ భాషలో విడుదలైన వారం రోజుల తర్వాత అన్ని భాషల్లోమేకర్స్ రిలీజ్ చేశారు . ఇక అప్పుడు మొదలైంది కాంతార కలెక్షన్స్ ఊచకోత. . రిషభ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా నిర్మితమైన ‘కాంతార’ 2022 సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదలైంది. కన్నడలో భారీ విజయాన్ని సాధించిన ఈ సినిమా, పాన్ ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించింది. తెలుగులో కూడా ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి ఈ సినిమా సీక్వెల్ కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అందుకే కాంతారకి సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్ అనే పేరుతో నిర్మిస్తున్నారు . కొంత కాలంగా అందుకు సంబంధించిన చిత్రీకరణ జరుగుతోందని చిత్ర యూనిట్ తెలిపింది . ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట . అందుకు తగినట్టుగానే అన్నింటినీ దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘కాంతార’ కథ మొదలు కావడానికి ముందు ఏం జరిగింది అనే పాయింట్ దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుందట. ఇక ‘కాంతార’ చిత్రం కేవలం 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా ఈ సినిమా అన్ని భాషల్లోను కలుపుకుని, 450 కోట్ల వరకూ కొల్లగొట్టి రికార్డ్స్ సృష్టించింది . అందుకే ప్రీక్వెల్ కి కాస్త భారీగానే ఖర్చు చేస్తున్నారట . ‘కాంతార’ ని మించి కాంతార’ ప్రీక్వెల్ ఉంటుందని మేకర్స్ చేతున్నారు.