తన మామకు ఎవరూ ఓటేయొద్దంటూ వీడియో విడుదల..!

ఆంధ్రప్రదేశ్ మంత్రి, వైసీపీ నేత మంత్రి అంబటి రాంబాబుపై ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ సంచలన ఆరోపణలు చేశారు. తన మామకు ఓటేయొద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో గోతం సోషల్ మీడియాలో ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేయగా ఈ వీడియోను టీడీపీ ట్విట్టర్ లో రీ పోస్టు చేసింది. వీడియోలో ఆయన అంబటి పై సంచలన ఆరోపణలు చేశారు .‘‘అంబటి రాంబాబు అల్లుడు కావటం తన దురదృష్టమని , దానికి ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు . అయితే, ఈ వీడియో చేయాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించి, చేయటం తన బాధ్యత అనుకున్న తర్వాతే ఈ వీడియో చేస్తున్నానని గోతం పేర్కొన్నారు . అంబటి రాంబాబు నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని తన జీవితంలో ఇంతవరకూ చూడలేదని వీడియోలో విమర్చించారు . రోజూ పొద్దున దేవుడికి దండం పెట్టుకునేటపుడు ఇంతటి నీచుడిని తన జీవితంలో ఇంకోసారి ఎంటర్ చేయద్దు స్వామీ అని మొక్కుకుంటున్నానని , అంత భయంకరమైన వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పటానికి కారణం తను పోటీ చేయబోయే ఎమ్మెల్యే పోస్టుకు తాను అనర్హుడని అన్నారు. ఏ పోస్టుకయితే మంచితనం, మానవతా విలువలు, కనీస బాధ్యత ఉండాలో అవేమీ లేని వ్యక్తి అంబటి రాంబాబు అని తెలిపారు . అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఇందులో అన్ని లక్షణాలు ఉండక్కర్లేదు కానీ ఇందులో 0.0001 శాతం లక్షణాలు కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు అని గౌతమ్ మండిపడ్డారు . ఇలాంటి వారికి ఓటేస్తున్నామంటే మనకు తెలియకుండానే కొన్నింటిని ప్రోత్సహిస్తున్నట్లు అవుతుందన్నారు. అంబటి లాంటి వారికీ ఓటేస్తే సమాజంలో నిస్సిగ్గుగా, ఎంత పెద్ద అబద్ధాన్నైనా పెద్ద గొంతేసుకుని నిజం చేసే కాన్ఫిడెన్స్ తో బతుకుతారో అలాంటి వారికి ఓటేస్తున్నట్లు అన్నారు . ఇలాంటి వాళ్లకు ఓటేస్తే సమాజం తలరాత మారి రేపటి సమాజం కూడా ఇలాగే తయారవుతుందని గౌతమ్ హెచ్చరించారు . దీనిని ప్రజలు గమనించి, సరైన బాధ్యతతో ఓటువేసి సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని డాక్టర్ గౌతమ్ ఈ వీడియోలో పేర్కొన్నాడు.