ఎంపీ రఘురామకృష్ణరాజు ఏపీ హైకోర్టుకు వచ్చారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అవినీతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. హైకోర్టులోని 19వ నెంబర్ హాల్లో 10వ ఐటెంగా రఘురాజు పిటిషన్ ఉంది. వైసీపీలో ఉంటూనే ఆయన సీఎం జగన్, వైసీపీపై విమర్శల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన ఏపీకి రావడం ఆపేశారు. చాలా కాలం తర్వాత ఆయన మొన్న సంక్రాంతికి భీమవరం వెళ్లారు. ఈ తర్వాత ఈరోజు మళ్లీ ఏపీలో అడుగుపెట్టారు. రఘురాజు రావడంతో హైకోర్టు వద్ద సందడి నెలకొంది.