జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ ఈ మధ్యాహ్నం ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు. అప్పటికే అక్కడ చంద్రబాబుతో బీజేపీ నేతలు షెకావత్, బైజయంత్ పండా సమావేశమయ్యారు. తాజాగా ఈ సమావేశంలో పవన్ కూడా పాల్గొన్నారు. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయి. ఎవరెక్కడ పోటీ చేసేదీ నేడు గానీ, రేపు గానీ ప్రకటించే అవకాశాలున్నాయి.