ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో స్పందించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళ అంటే కుటుంబంలో ఒక తల్లి, ఒక చెల్లి, ఒక కూతురు మాత్రమే కాదని… సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక రంగాలలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళుతున్న ఒక చాంపియన్ అని వివరించారు. ప్రతి మహిళ తన సామర్థ్యాలను గుర్తించి ఆకాశమే హద్దుగా ఎదగాలని కోరుకుంటున్నట్టు వివరించారు.