మహిళా దినోత్సవం నాడు సీఎం జగన్ పై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. జగన్ పాపం పండిందని, అధికారం కోసం చేసిన పాపాలే శాపాలయ్యాయని పేర్కొన్నారు. జగన్ 420 అన్న షర్మిల వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బట్టబయలైందని యనమల వ్యాఖ్యానించారు. సొంత చెల్లెళ్లకే జవాబు చెప్పలేని జగన్ ప్రజలకు ఏం చెబుతారని ఎద్దేవా చేశారు. కుటుంబ సభ్యుల నమ్మకమే పొందలేని జగన్ ప్రజలను ఏం ఉద్ధరిస్తారని ఎత్తిపొడిచారు. షర్మిల, సునీత, విజయమ్మలకు ఏ హాని జరిగినా జగన్ దే బాధ్యత అని యనమల స్పష్టం చేశారు. మహిళా సాధికారత టీడీపీతోనే సాధ్యమని అన్నారు.