పట్టణ స్థానిక పెదఎరుకపాడు వార్డులో గుంతలమయంతో ఉన్న రోడ్లు మరియు పిల్లల పార్కు సమస్యల మీద నిరసన కార్యక్రమం తెలియజేసిన వార్డు ప్రజలు మరియు గుడివాడ పట్టణ జనసైనికులు. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ(Rk) మాట్లాడుతూ గుడివాడ పట్టణ స్థానిక పెదఎరుకపాడు వార్డులో రోడ్లు గుంతల మయం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు, వాహనాదారులు, స్కూలు పిల్లలు, ఆ రోడ్లో వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారని అదేవిధంగా అడపా బాబ్జి గారి పేరు మీద పిల్లల పార్కు ఏర్పాటు చేస్తామని రెండు సంవత్సరాలు కావస్తున్న కనీసం ఒక తట్ట మట్టి కూడా వెయ్యలేకపోవడం చాలా దౌర్భాగ్యం అని ఆరోపణ చేశారు ఈ ఆహ్లాదకరమైన పార్కులు లేకపోవడం వల్ల పిల్లలు సెల్ ఫోన్లు కి టీవీలకు దగ్గరగా అయ్యి ఆహ్లాదకరమైన వాతావరణం దూరం అవుతున్నారని దయచేసి గుడివాడ పట్టణ మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యలను తీర్చాలని వార్డ్ ప్రజలు తరఫున మరియు గుడివాడ జనసేన పార్టీ తరఫున తెలియజేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటు ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉంటారని ప్రశ్నించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుందని మా నాయకుడు నేర్పిన సిద్ధాంతంతో గుడివాడ పట్టణంలో అనేక సమస్యల మీద పోరాడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మీరా షరీఫ్ గారు నూనె అయ్యప్ప, దివిలి సురేష్, పందిళ్ళ శీను, గంట అంజి, చరణ్ తేజ్, శివ, చరణ్, మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.