తిరుమల వెంకటేశ్వరుడిని శ్రీదేవి కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ దర్శించుకుంది. ఈ రోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామి వారి సేవలో పాల్గొంది. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు జాహ్నవికి స్వాగతం పలికారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో వచ్చిన జాన్వీ.. అచ్చ తెలుగు అమ్మాయిలానే కనిపించింది. జాన్వీ తిరుమలకు తరచూ వస్తుంటుంది. అప్పుడప్పుడు అలిపిరి మార్గంలో మెట్లు ఎక్కి వస్తుంటుంది.