రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. ‘కేజీఎఫ్’ తలదన్నే రీతిలో ఈ చిత్రం ఉండబోతోందనే అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింతగా పెంచింది. మరోవైపు అమెరికాలో ఈ సినిమా మేనియా అప్పుడే ప్రారంభమయినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘సలార్’ అడ్వాన్స్ బుకింగ్ లను అమెరికాలో అప్పుడే ప్రారంభించారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్లను ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే ఓవర్సీస్ లో ఈ చిత్రం ఘన విజయం సాధించడం ఖాయమని చెపుతున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ ను సెప్టెంబర్ తొలి వారం నుంచి ప్రారంభిస్తున్నారట. సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానుంది.