వివాదాస్పద సినీ, రాజకీయ జోతిష్య పండితుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈయన ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వైరల్ అవుతుంటారు వేణు స్వామి. రీసెంట్ గా వేణుస్వామి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ సినిమాల గురించి కామెంట్ చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ గురించి కూడా వేణు స్వామి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు . అయితే మహేష్ ‘గుంటూరు కారం’ సినిమాను కూడా కావాలని ఫేక్ పబ్లిసిటీ ద్వారానే ఫెయిల్యూర్ చేశారని వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు . అంతెందుకు నిన్న కాక మొన్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజైంది. సినిమా రిలీజ్ అవకముందే నెగిటివ్ రివ్యూలు పెట్టేశారన్నారు . ట్రోల్స్, మీమ్స్, ఫేక్ రివ్యూలకి నాశనమైపోయిన వ్యక్తి విజయ్ దేవరకొండ. ఈ సినిమా నాశనమవ్వడానికి కారణం ఫేక్ రివ్యూలే. ఎందుకంటే సినిమా బయటికి రాకమందే బాలేదు, రాడ్డు దింపాడు అంటూ రివ్యూలు పెట్టేశారు. ఇలాంటి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తే సినిమాకు వెళ్ళేవాళ్ళు కూడా వెళ్లరని వేణు స్వామి చెప్పుకొచ్చారు.అయితే గతంలో కూడా వేణుస్వామి విజయ్ దేవరకొండ జాతకం ఎలా ఉండబోతుందనే దానిపై వేణు స్వామి చాలాసార్లు కాంట్రవర్శి కామెంట్లు చేశారు . విజయ్ దేవరకొండది కెరీర్ పరంగా అంత గొప్ప జాతకేం కాదని ,.. అంతెత్తుకు పైకి లేచి కిందపడిపోయే జతకమన్నారు .. అంతేకాదు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండే జాతకం కాదంటూ వేణు స్వామి చెప్పడం గమనార్హణం . కానీ ఈసారి మాత్రం విజయ్ దేవరకొండ సినిమాను కావాలని ఫేక్ రివ్యూలతో ఫ్లాప్ చేశారంటూ వేణుస్వామి