వరలక్ష్మి శరత్ కుమార్ .. ఇప్పుడు తెలుగు .. తమిళ భాషల్లో లేడీ విలన్ పాత్రలకు ముందుగా పరిశీలించే పేరు. ఈ రెండు భాషల్లోని ప్రేక్షకులు ఆమె విలనిజాన్నీ .. డైలాగ్ డెలివరీని ఇష్టపడతారు. ఇక కీలకమైన పాత్రలలోను .. ప్రత్యేకమైన పాత్రలలోను ఆమె తన మార్క్ చూపిస్తూ వెళుతోంది. ఆమె నటించిన ‘హను మాన్’ రేపు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇటీవల వచ్చిన ప్రభాస్ ‘సలార్’ సినిమాలో శ్రియా రెడ్డి ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది. ‘సలార్’పై పగ తీర్చుకోవడానికి ఎదురుచూసే పాత్ర అది. ఆ పాత్ర వరలక్ష్మి శరత్ కుమార్ చేస్తే బాగుండేదనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. ముందుగా వరలక్ష్మినే అనుకున్నారనీ, అయితే కొన్ని కారణాల వలన ఆమె చేయలేకపోయిందనే టాక్ కూడా వచ్చింది.