పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని మైక్రాన్ కంపెనీ సీఈవో సంజయ్‌కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం సంజయ్… సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నింటికి తగిన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.