`బ్రో` టీజర్‌ అప్‌డేట్‌ అంటూ టీమ్‌ హడావుడి చేస్తూనే ఉంది. తాజాగా ఎట్టకేలకు టీజర్‌ విడుదల టైమ్‌ని ప్రకటించింది. రేపు గురువారం(జూన్‌ 29) సాయంత్రం `బ్రో` టీజర్‌ని విడుదల చేయబోతున్నారు. సాయంత్రం ఐదు గంటల నాలుగు(5.04) నిమిషాలకు టీజర్‌ని విడుదల చేయబోతున్నట్టు టీమ్‌ వెల్లడించింది.  పవన్‌ స్టయిల్‌కి, ఇమేజ్‌కి తగ్గట ఫ్యాన్స్ కోసం కమర్షియల్‌ ఎలిమెంట్స్, మాస్‌ ఎలిమెంట్లని కూడా జోడించారట. దీంతో చాలా వరకు ఈ సినిమా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పవన్‌ ఫస్ట్ లుక్‌ వాహ్‌ అనిపించింది. ఫ్యాన్స్ చేత ఈలలు వేయించింది. ఇందులో పవన్‌ లుక్‌ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇప్పుడు టీజర్‌ ఎలాంటి రచ్చే చేయబోతుందో చూడాలి.