ప్రజంట్ తెలంగాణ రాజకీయం అంతా ఢిల్లీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ అసలేం జరుగుతుందో అంతుబట్టకుండా ఉంది. అటు కాంగ్రెస్‌లో చేరికల జోష్ కనిపిస్తుంటే.. ఇటు బీజీపీ మాత్రం అంతర్మథనంలో ఉంది. నాయకుల మధ్య విబేధాల నేపథ్యంలో.. ఆ పార్టీ హై కమాండ్ అలెర్టయింది. ఇప్పుటికే రాష్ట్ర అగ్ర నేతలను ఢిల్లీ పిలిచి.. మాట్లాడి రిపోర్ట్ తీసుకుంది. బండి సంజయ్‌ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని.. మరొకరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈటలకు కూడా కీలక బాధ్యతలు అప్పగించే సూచనలు ఉన్నాయి. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం ఈటల హుషారుగా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు. మరోనేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం.. బీజేపీకి కటీఫ్‌ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సన్నిహితులతో ఆయన తన మనోసులోని మాట చెబుతున్నారట.